This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

డిస్పోజబుల్ డైపర్లు వాడుతున్నప్పుడు రాషెస్ నివారించడం సాధ్యం అవుతుందా?

Written by - Dhanlaxmi RaoLast updated: Nov 3, 2023
డిస్పోజబుల్ డైపర్లు వాడుతున్నప్పుడు రాషెస్ నివారించడం సాధ్యం అవుతుందా?
Read time6 min

డైపర్ వల్ల దద్దుర్లు రావడం అనేది సహజం. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎక్కువగా క్లాత్ డైపర్లు లేదా డిస్పోజబుల్ డైపర్లు ఉపయోగిస్తారు. ఇవి పిల్లలను ప్రభావితం చేస్తాయి. వారి చర్మం మీద దద్దర్లు వచ్చేందుకు కారణం అవుతాయి. మూత్రం లేదా మలం అనేది డైపర్​లో ఉండడం వలన సాధారణంగా దద్దుర్లు వస్తాయి. మూత్రం మరియు మలం అనేవి డైపర్​లో అలాగే ఉన్నపుడు అవి పిల్లల చర్మం మీద వెచ్చని తేమ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. దీని వలన వారికి చికాకు కలుగుతుంది. వారి సున్నితమైన చర్మం దీనికి ప్రతిస్పందిస్తుంది. కేవలం ఈ కారణం వల్లే డిస్పోజబుల్ డైపర్ వల్ల దద్దుర్లు వస్తాయని అనుకోవడం పొరపాటే అవుతుంది. అసలు పిల్లల చర్మం మీద దద్దుర్లు రావడానికి వచ్చే పూర్తి కారణాలు తెలుసుకోవడం అవసరం. డిస్పోజబుల్ న్యాపీస్ వల్ల శిశువులకు దద్దుర్లు రావడానికి కారణాలు, మరియు ఆ దద్దుర్లను నివారించేందుకు గల చిట్కాలను చదివేందుకు కిందికి స్క్రోల్ చేయండి.

డిస్పోజబుల్ డైపర్లు వాడినపుడు దద్దుర్లు రావడానికి కారణాలు: (Reasons for rashes while using disposable diapers)

పిల్లలకు డైపర్స్ వాడడం వలన దద్దుర్లతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు అసలు దద్దుర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. దద్దుర్లు వచ్చేందుకు కారణం డర్టీ(పాడైపోయి ఉన్న) డైపర్స్ అని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. వారి పిల్లలకు దద్దర్లు రాకుండా ఉండేందుకు ఉండే ఇతర కారణాలను విస్మరించడం కూడా సరైన పద్ధతి కాదు.

1. రాపిడి (Friction):

డైపర్ దద్దుర్లకు ప్రధాన కారణం.. డిస్పోజబుల్ డైపర్స్​ శిశువు సున్నితమైన చర్మం మీద రాపిడిని కలుగజేస్తాయి. ఈ రాపిడి అనేది చర్మం మీద ఎరుపు మరియు వాపును కలుగజేస్తాయి. చాలా బిగుతుగా ఉండే డైపర్స్ బిడ్డకు మరింత చికాకును కలిగిస్తాయి. ఇవి చర్మం మీద మరిన్ని దద్దుర్లకు కారణం అవుతాయి.

2. డైపర్ సాగేందుకు వాడే రసాయనాల వల్ల ఎలర్జీలు )Chemicals used in disposable diapers):

పిల్లల కోసం వాడే డిస్పోజబుల్ డైపర్లలో ఉండే రసాయనాల వల్ల దద్దుర్లు అలెర్జీలు వస్తాయి. వీటి వల్ల పిల్లల సున్నితమైన చర్మం పాడవుతుంది. డిస్పోజబుల్ డైపర్ ఎలాస్టిక్​లో వాడే రసాయనాల వల్ల ఎలర్జీలు వస్తాయి.

3. పాలిచ్చే పద్ధతి (Feeding process):

బాటిల్ ఫీడ్ కాకుండా తల్లిపాలు తాగే పిల్లలకు తక్కువగా డైపర్ రాషెస్ (దద్దుర్లు) వచ్చే అవకాశం ఉంది. తల్లిపాలు తాగే పిల్లలు తరచూ కొద్దిగా మాత్రమే మలం విసర్జిస్తారు. ఇది వారి సున్నితమైన చర్మానికి తక్కువ చికాకుకు కలిగిస్తుంది.

4. యాంటీ బయాటిక్స్ వాడకం (Antibiotics usage):

డైపర్ రాష్ యొక్క అత్యంత సాధారణ కారకం.... యాంటీ బయాటిక్స్ వంటి రసాయనాలు. ప్రయోజనకరంగా ఉండే బ్యాక్టీరియా కొన్ని జీవులను నియంత్రణలో ఉంచుతుంది. కానీ తరచుగా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల ఇది డిస్ట్రబ్ అవుతుంది.

5. కొత్త ఉత్పత్తులను ఉపయోగించడం (Using new products):

కొత్త డైపర్ ఉత్పత్తిని వాడడం వలన దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కొత్త ఉత్పత్తిని పరిచయం చేసిన వెంటనే శిశువు చర్మం ప్రతిస్పందిచే అవకాశం ఉంది. వాడే లోషన్స్, పౌడర్స్, నూనెలు వారి సున్నితమైన చర్మానికి సరిగ్గా సరిపోకపోవడం వల్ల ఎర్రటి మచ్చలు ఏర్పడవచ్చు.

6. ఇంతకు ముందే ఉన్న చర్మ సమస్యలు (Skin problems):

డైపర్ల వలన దద్దుర్లు వచ్చేందుకు ఇతర కారణం.. ఇంతకు మునుపే శిశువుకు చర్మ సమస్యలు ఉండడం. లేదా ఎలర్జీ వల్ల డైపర్ రాషెస్ అభివృద్ధి చెందుతాయి.

చిన్నపిల్లలకు డైపర్ వల్ల దద్దుర్లు రాకుండా నివారించడం ఎలా?(How to prevent rashes while using disposable diapers)

శిశువు డైపర్ రాషెస్ (దద్దుర్లు) వారి చర్మాన్ని మరింత అసౌకర్యంగా మార్చి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసేందుకు కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. తరచుగా డైపర్ మార్చడం (diaper changing):

ఎంత తరచుగా తల్లిదండ్రులు తమ బిడ్డ డైపర్​ను మారుస్తారో.. పిల్లలకు డైపర్ దద్దుర్లు రాకుండా చూసుకోవడం అంతే సులభం అవుతుంది. దురద రాకుండా ఉంచేందుకు శిశువు కింది భాగాన్ని పొడిగా మరియు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. తరచుగా డైపర్ మార్చడం వలన శిశువు పొడిగా (డ్రైగా) ఉండేందుకు మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందకుండా ఉండేందుకు కీలకం. రాత్రిపూట శిశువు డైపర్ మార్చాల్సిన అవసరం ఉందో లేదో తనిఖీ చేయండి. వారి డిస్పోజబుల్ డైపర్ కింది భాగం పొడిగా ఉందో లేదో తనిఖీ చేయడం మరియు చేంజ్ చేయడం ద్వారా దీన్ని చేయవచ్చు.

2. పూర్తిగా శుభ్రం చేయడం (Cleaning Thoroughly)

డైపర్ రాషెస్ (దద్దుర్లు) రాకుండా చూసుకోవడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. డైపర్లను పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా దీనిని నివారించవచ్చు. డైపర్​లను మార్చేటపుడు ఏవైనా పుండ్లు లేదా ఎరుపుగా ఉంటే వైప్​లను (తడిని తుడిచేందుకు ఉపయోగించేవి) ఉపయోగించడం మానేయాలి. ఎందుకంటే ఇది చికాకును మరింత తీవ్రతరం చేస్తుంది. మలం చాలా జిగటగా ఉంటే.. తప్ప సబ్బును ఉపయోగించొద్దు.

3. క్రమం తప్పకుండా క్రీమ్ లేదా ఆయింట్​మెంట్ అప్లై చేయడం (Applying diaper cream)

పిల్లలకు డైపర్ వలన రాషెస్ (దద్దుర్లు) వచ్చినపుడు డైపర్ వల్ల వచ్చే అవశేషాల వల్ల వారి చర్మం మరింత చికాకుగా తయారవుతుంది. వారి చికాకును తగ్గించేందుకు డైపర్ మార్చే సమయంలో క్రీమ్, పేస్ట్, ఆయింట్​మెంట్ అప్లై చేయడం ముఖ్యం.

4. డైపర్ వేయకుండా ఉండడం (No diaper)

మీ శిశువు డైపర్ వల్ల దద్దుర్లతో బాధపడుతుంటే.. మీ శిశువుకు డిస్పోజబుల్ డైపర్లు వేయకుండా ఖాళీగా ఉంచడం ముఖ్యం. వారి చర్మాన్ని గాలికి ఉంచేందుకు ప్రయత్నించండి.

5. డైపర్లను సరిగ్గా తొడగాలి.. కానీ అవి బిగుతుగా ఉండకూడదు (Wear diapers properly)

శిశువు చర్మం మృదువుగా ఉండేలా డైపర్ అనేది సౌకర్యవంతంగా ఉండాలి. కానీ చర్మం మీద దద్దుర్లు వచ్చేంత బిగుతుగా ఉండకూడదు. కొంత గాలి ప్రవాహాన్ని అనుమతించే డిస్పోజబుల్ డైపర్స్ ఉపయోగించడం ద్వారా దద్దుర్లను నివారించవచ్చు.

6. సరైన సైజ్ (పరిమాణం) ఉండే డైపర్ (Correct fit disposable diaper):

మీ పిల్లలు సరైన సైజ్ (పరిమాణం) ఉన్న డిస్పోజబుల్ డైపర్ ధరించినట్లు నిర్ధారించుకోండి. వారు తప్పనిసరిగా ఆ ప్రాంతాన్ని (బ్యాక్​) కవర్ చేసే డిస్పోజబుల్ డైపర్ ధరించడం చాలా ముఖ్యం. కరెక్ట్ సైజ్ (పరిమాణం) ఉండే డైపర్లను ధరించడం వలన డైపర్ అంచుల చుట్టూ ద్రవం బయటకు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ద్రవం లీక్ కావడం వల్ల మరింత బాధాకరమైన దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది.

చివరగా:

డిస్పోజబుల్ డైపర్లను ఉపయోగించినా కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు దద్దుర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. దద్దర్లు అనేవి కేవలం డైపర్స్ వల్ల మాత్రమే కాకుండా కొన్ని ఉత్పత్తుల వల్ల కూడా వస్తాయి. అందుకే సరైన డిస్పోజబుల్ డైపర్లు వాడాలి. ప్రమాదం లేని మరిన్ని శిశు ఉత్పత్తుల కోసం మరియు అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించేందుకు మీరు మైలో స్టోర్ని సందర్శించవచ్చు. ఇంకా ఎటువంటి ఇబ్బందిని కలిగించకుండా ఉండేందుకు క్లాత్ డైపర్లను వినియోగించవచ్చు.వీటిని కూడా మీరు మైలో స్టోర్ లో చూడొచ్చు.

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.